
కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో
ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని ఉపమాక పంచాయతీ శివారు మనబాలవానిపాలెం వద్ద నిర్మించిన సంపద తయారీ కేంద్రాన్ని బుధవారం ఎంపీడీవో సీతారామరాజు, ఈఓపిఆర్డి వెంకటనారాయణ సందర్శించారు. కేంద్రానికి సంబంధించి మిగిలిన పనులను పూర్తి చేసి, వెంటనే వాడుకులోకి తీసుకురావాలని పంచాయతీ కార్యదర్శి జయ ప్రకాష్‌కు సూచించారు. సంపద తయారీ కేంద్రం అందుబాటులోకి వస్తే గ్రామాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా,పంచాయతీకి ఆదాయం లభిస్తుందన్నారు. సచివాలయ సేవలపై ఆరా తీశారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కార్యదర్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో సత్తిబాబు పాల్గొన్నారు.