Oct 28,2023 22:06

గడప గడపకూ కార్యక్రమంలో మంత్రి అదిమూలపు సురేష్‌


ప్రజాశక్తి-పుల్లలచెరువు
జన సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. శనివారం పుల్లలచెరువు గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అసామాన్యంగా ఆమలు చేస్తూ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారన్నారు. ఏమైనా సమస్యలున్నా, అర్హులై ఉండి పథకాలు అందక పోయినా వెంటనే తెలియజేయాలన్నారు. ఆయన దష్టికి తీసుకొచ్చిన పలు సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా మారడాన్ని జీర్ణించలేక, పచ్చ నేతలకు కంటి మీద కునుకు ఉండటం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో పారిశ్రామిక అభివద్ధి అంటే కేవలం కాగితాల మీదనే జరిగేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ బివి సుబ్బారెడ్డి, జడ్పిటిసి వాగ్యా నాయక్‌, మండల ఉపాధ్యక్షుడు లింగంగుంట్ల రాములు, నాయకులు కొర్లకుంట జానకీరఘు, సచివాలయ కన్వీనర్‌ దొమకాల వెంకటేశ్వర్లు, డిఎల్‌డివో బివిఎన్‌ సాయికుమార్‌, తహశిల్దార్‌ దాసు, ఎంపిడివో మరియదాసు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.