ప్రజాశక్తి-రేపల్లె: సంక్షేమ ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్రంలో ప్రజల నుంచి నీరాజనాలు అందుతు న్నాయని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. మండలంలోని బేతపూడి పంచాయతీ ఉయ్యూరువారిపాలెం, తురక పాలెం గ్రామంలో సోమవారం నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా పారదర్శ కంగా వాటిని అమలు చేస్తున్న తీరును పక్క రాష్ట్రాల పాలకులకు ఆదర్శంగా నిలుస్తోంద న్నారు. గతంలో కనీవినీ ఎరుగని విధంగా ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేసేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా నివేశన స్థలాలను అందించి గృహ నిర్మాణాలకు పూనుకున్నారన్నారు. పార్టీలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల ముంగిటకు చేర్చుతున్నారన్నారు. ప్రతిపక్షాల నాయకులు సైతం ప్రభుత్వ పథకాలను పొంది ప్రభుత్వ పాలనను ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉందన్నారు. నేడు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ప్రజాప్రతినిధులే స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకుని సత్వరమే పరిష్కరిస్తున్నారని చెప్పారు. సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తుంటే ప్రతి లబ్ధిదారుడు తాము పొందిన లబ్ధి వివరాలను తెలియజేస్తూ మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి కొనసాగాలని కోరుకోవటం వైసీపీపై ప్రజల్లో ఏర్పడిన నమ్మకానికి నిదర్శనమని అన్నారు. బేతపూడి పంచాయతీ పరిధిలోని లబ్ధిదారులకు రూ.5.60 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొర్రా శ్రీనివాసరావు, సర్పంచ్ ఆలూరి పద్మ, ఎంపీటీసీ జయమ్మ, కోఆప్షన్ సభ్యుడు ఫరీద్, కార్పొరేషన్ల డైరెక్టర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










