Oct 15,2023 21:40

డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు
ప్రజాశక్తి - కాళ్ల
వైసిపి ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని ఇంటింటికీ ప్రచారం చేయాలని, గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడాను ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు అన్నారు. పెదఅమిరంలోని వైసిపి కార్యాలయంలో 'వై ఎపి నీడ్స్‌ సిఎం జగన్‌' కార్యక్రమంపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పివిఎల్‌ మాట్లాడుతూ ప్రతిపక్షాల ఆరోపణలను వైసిపి ప్రభుత్వం విజయాలతోనే గట్టిగా తిప్పికొట్టాలన్నారు. విభజన తర్వాత రాష్ట్ర సమగ్ర పురోగతికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగడం చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, సర్పంచుల ఛాంబర్‌ జిల్లా అధ్యక్షులు కొలుకులూరి ధర్మరాజు, గ్రామ సర్పంచి డొక్కు సోమేశ్వరరావు, వైసిపి మండల కన్వీనర్‌ గణేశ్న రాంబాబు, కోపల్లె సొసైటీ అధ్యక్షులు వేగేశ్న జయరామ కృష్ణంరాజు, పి.దుర్గా ప్రసాదరాజు, మన్నే నాగరాజు పాల్గొన్నారు.