Oct 27,2022 23:00

ప్రజాశక్తి -నందిగామ
పట్టణంలోని 10 వ వార్డులో గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌ మోహన్‌ రావు గురువారం నిర్వహించారు. నందిగామ పట్టణంలోని 10వ వార్డు పరిధిలో గురువారం ఉదయం గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్‌ మొండితోక జగన్‌ మోహన్‌ రావు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల క్యాలెండర్‌ ను అందజేస్తూ - ప్రభుత్వ పనితీరును వివరించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ ఒకపక్క అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తుండటంతో పాటు మరోవైపు అభివద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. మూడేళ్ల పాలనలో విద్య -వైద్యం -వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారన్నారు. పట్టణంలో మూడు దశాబ్దాలుగా జరగని అభివద్ధిని సీఎం వైఎస్‌ జగన్‌ సహకారంతో మూడేళ్ల కాలంలో చేసి చూపించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్‌, ఏఈ, సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు పాల్గొన్నారు .