
ప్రజాశక్తి-దత్తిరాజేరు : ప్రజా సంక్షేమం, అభివృద్ధి సిఎం జగన్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య తెలిపారు. మండలంలోని పెదమానాపురంలో నూతన నిర్మించిన సచివాలయ, రైతుభరోసా, వెల్‌నెస్ సెంటర్లను శనివారం ఆయన న్రపారంభించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఇళ్లు కోల్పోయిన వాళ్లు ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యే దష్టికి తేవడంతో, తగు సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని బొత్స హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ వేమల ముత్యాల నాయుడు, ఎంపిపి గేదెల సింహాద్రి అప్పలనాయుడు, జెడ్‌పిటిసి రౌతు రాజేశ్వరి, వైస్ ఎంపిపిలు మామిడి అప్పలనాయుడు, మిత్తిరెడ్డి రమేష్ నాయుడు, మండల శ్రీనివాసరావు, సోమల శ్రీనివాసరావు , సర్పంచ్ గొట్టివాడ దాసు, ఎంపిటిసి కన్నయ్య, వైస్ సర్పంచ్ ఆదినారాయణ, ఎంపిడిఒ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.