ప్రజాశక్తి -నందిగామ
మండలంలోని కమ్మవారిపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ గ్రామాల అభివద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. గామ సర్పంచ్ పెంటమాల నిర్మల, మాజీ సర్పంచ్ వేల్పుల కిషోర్, రాజేంద్ర పాల్గొన్నారు.










