Dec 21,2022 23:55

ప్రారంభిస్తున ఎంపి, ఎమ్మెల్యేలు

ప్రజాశక్తి-పాయకరావుపేట:రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పెద్ద పీట వేశారని ఎంపీ బీవీ సత్యవతి, ఎమ్మెల్యే గొల్ల బాబురావు కొనియాడారు.పాయకరావుపేటలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఆస్పత్రి ప్రహరీ గోడకు ఎలక్ట్రికల్‌ నిమిత్తం నిధులు మంజూరు చేస్తానని ఎంపీ తెలిపారు. ఈ హాస్పిటల్‌ను రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మండలి అభివృద్ధి చైర్మన్‌ చిక్కాల రామారావు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు గుటూరు శ్రీనివాసరావు, గారా ప్రసాద్‌ ఉషశ్రీ, జడ్పిటిసి లంక సూరిబాబు, ఎంపీపీ పార్వతీ తాతారావు, వైసిపి మండల పార్టీ అధ్యక్షులు దనిశెట్టి బాబురావు, పట్టణ అధ్యక్షులు సాయిబాబా, జగత శ్రీను, రామకృష్ణ, స్థానిక వైద్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.