ప్రజాశక్తి-చీడికాడ: ప్రజల సంక్షేమంకు వైసిపి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. మండలంలోని కోనాం సచివాలయం పరిధి వాకపల్లి, గుడివాడ, గుంటి, కొత్తూరు పనసగడ్డ గ్రామల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూడి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయన్నారు. పథకాలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కురచా జయమ్మ నారాయణమూర్తి, జెడ్పిటిసి లాలం శారద వరలక్ష్మి జానకిరామ్, వైస్ ఎంపీపీ ధర్మశెట్టి స్వాతి కొండబాబు, కిమిడి చిన్నమ్మలు కన్వీనర్ రాజబాబు, యువజన అధ్యక్షుడు స్వామినాయుడు, పంచాయతీ కార్యదర్శి సన్యాసిరావు, నాయకులు ఎర్ర అప్పారావు, పాటూరు రమణ రెడ్డి, దేముడు నాయుడు, అధికారులు, సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










