Dec 12,2022 23:30

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే నాగిరెడ్డి

ప్రజాశక్తి-గాజువాక: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. 65వ వార్డులో కార్పొరేటర్‌ బొడ్డు నరసింహ పాత్రుడు అధ్యక్షతన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ.51 లక్షల వ్యయంతో కాకతీయ లోవ, భానోజీ తోట రోడ్డు నంబర్‌ 2, 6, బాపూజీ కాలనీ, నేతాజీ కాలనీల్లో సీసీ రోడ్లు, కాలువలు, కల్వర్టులు, బీటీ రోడ్డు మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆయా వార్డుల్లో అపరిష్కృతంగా ఉన్న పనులకు ముందుగా ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ సింహాచలం, స్థానిక నాయకులు మద్దాల అప్పారావు, నాగిశెట్టి శ్రీనివాస్‌, ఇరోతి గణేష్‌, సింగంపల్లి దేముడు, ఎల్‌వి.రమణ, అడిగర్ల రమణ, వెంకటరావు, రామకృష్ణ, శ్రీరామ మూర్తిరాజు, శ్రీనివాసరాజు, పిల్లా శ్రీనివాస్‌, దాడి వేణు, సూరిబాబు, గణపతి, కృష్ణ, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ, నాయుడు, శ్రీహరి, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.