
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు వైసిపి మండల క న్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్ పేర్కొన్నారు. గురువారం ఎంపిడిఒ ప్రత్యూష అధ్యక్షతత తోటపల్లిగూడూరు సచివాలయ పరిధిలో ''వై నీడ్స్ ఎపిి జగన్'' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకరయ్య గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఓ వైపు, కరోనా మహమ్మారి మరోవైపు వెరసి ఆర్థిక లోటు నేపథ్యంలోనూ జ గన్మోహన్ రెడ్డి అత్యంత సమ ర్ధవంతంగా ప్రజారంజక పాలన సాగిస్తున్నారన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా కోరు కొంటున్నారని శంకరయ్య గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో నెల్లూరు జిల్లా గ్రీవె న్ సెల్ అధ్యక్షులు, జగనన్న స చివాలయ మండల కమిటి క న్వీనర్ తలమంచి సురేంద్ర బా బు, ఏఎంసి డైరెక్టర్ మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్, మాజీ జె డ్పిటిసి చిరంజీవి, మాజీ స ర్పంచ్ ఈదూరు, కన్వీనర్ రా మాచార్యులు తదితరులు పా ల్గొన్నారు.