రాయచోటి టౌన్/రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ మైదానంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజ రౖన మంత్రి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు సందేశమిచ్చారు. వివిధ శాఖలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. ఈసందర్భంగా మంత్రి మాట్లా డుతూ ప్రభుత్వ సంక్షేమాభివద్ధి కార్యక్రమాల లక్ష్య సాధనలో ముందంజలో ఉన్నామన్నారు. అభివృద్ధిలో జిల్లాను అగ్రపథంలో నిలిపేందుకు అందరం అంకితభావంతో కషి చేద్దామని తెలిపారు. జిల్లాలో సాధారణం కన్నా 33 శాతం తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాలోని 400 ఆర్బికేల ద్వారా రైతన్న లకు నాణ్యమైన విత్తనాలను ఇప్పటికే పంపిణీ చేశామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4,996 కోట్ల ఆర్థిక లక్ష్యానికి గాను ఇప్పటికే రూ.2,833 కోట్లు పంట రుణాలను మంజూరు చేశామని పేర్కొన్నారు. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా సరఫరా చేస్తున్నా మన్నారు. జిల్లాలో 400 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల ద్వారా 2023 ఖరీఫ్ సీజనుకు గాను రూ.20 కోట్ల సబ్సిడీతో 75,600 మంది రైతులకు 58,687 క్వింటాళ్ల విత్తనాలను అందించామన్నారు. పాడి పరిశ్రమ ద్వారా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పరంగా సరాసరిన 6 నుంచి 8 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాబోయే రెండు సంవత్సరాలలో 10 లక్షల లీటర్ల మేర పాల ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 12 వేల హెక్టార్లలో బిందు, తుంపర సేద్యం అమలు చేయడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 18 వేల మంది రైతులు 14700 హెక్టార్లకు పరికరాల కొరకు ఆర్.బి.కెల ద్వారా నమోదు చేసుకున్నారని పేర్కొ న్నారు. నాడు-నేడు పథకం జిల్లాలో రెండవ దశలో రూ.277 కోట్ల అంచనా ఖర్చుతో అదనపు తరగతి గదులు, మరుగుదొర్హు, ఎలెక్టిఫికేషన్, ఇంగ్లిషు ల్యాబ్, తాగు నీటి వసతి వంటి సదుపాయాలనకల్పించామని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంతో వైద్యాధికారుల బందం గ్రామాలలో ప్రజల ఇంటి వద్దనే 14 రకాల డయాగ్గోస్టిక్స్ సేవలు, సాధారణ రుగ్మతులు, దీర్ధక్రాలిక సమస్యలకు సేవలను అందిస్తున్నామన్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను సమర్ధవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కషి చేస్తోందన్నారు. పేదవాని సొంత ఇంటి కలను నిజం చేయడానికి జిల్లాలో ఇప్పటి వరకు రూ.707 కోట్లు వ్యయంతో 74,418 గహాల నిర్మాణ పనులు చేపట్టామన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి దివంగత మహానేత వైఎస్‌ఆర్ కలలుగన్న జలయజ్ఞాన్ని కొనసాగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. చెరువులను పునరుద్ధరించి జలకళను తీసుకువచ్చి తద్వారా లక్షలాది రైతు కుటుంబాలకు వెలకట్టలేని లబ్దిని చేకూర్చే దిశగా ప్రభుత్వం కషి చేస్తోందని పేర్కొన్నారు.
సీనియర్ సిటిజన్లకు సన్మానం : 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా కలెక్టర్ గిరీష, ఎస్‌పి గంగాధరరావులతో కలిసి సీనియర్ సిటిజన్లు రామాపురం మండలం పొత్తుకూరుపల్లి వీరబల్లి రామన్న, అదే మండలం సుద్దమల్ల గ్రామానికి చెందిన సుద్ధమల్ల నాగమ్మను ఘనంగా సత్కరించారు.
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన : జిల్లా అభివద్ధిని ప్రతిబింబించేలా వివిధ ప్రభుత్వ శాఖలు ప్రగతి శకటాలను ప్రదర్శించారు. ఇందులో దిశా బందం, మైన్ ప్రొటెక్టెడ్ వాహనం, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ, గహనిర్మాణ శాఖ, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా సంస్థ (ఆర్డబ్ల్యూఎస్) శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా), విద్యాశాఖ, రాయచోటి పురపాలక సంఘం శకటం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, 108/104/102 వాహనాలు ప్రగతి శకటాలను ప్రదర్శించాయి. అనంతరం పోలీసు జాగిలాలు 'జూలీ, జాకీ, మ్యాగీలు' చేసిన... హార్డిల్ జంప్, అగ్నిప్రమాద సమయాలు, నేరస్తులు వదిలి వెళ్లిన వస్తువులను, పట్టుకోవడం, నేరస్తులను గుర్తించడం, ఎర్రచందనం వాహనాల గుర్తింపు, స్టెంట్ జంప్, తదితరాలు చూపర్లను సంబ్రమాశ్చర్యాలకు గురి చేయగా ప్రతి ఒక్కరూ చప్ప ట్లతో అభినందించారు. అగ్నిమాపక శాఖ వారు చూపిన అగ్నిమాపక విన్యా సాలు ఆకట్టుకున్నాయి. 120 మంది రాయచోటి శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్ వారు దేశమంటే మతం కాదు, మట్టి కాదోరు అంటూ చేసిన నత్యం, కార్గిల్ వార్‌ను స్ఫురించేలావీరోచితంగా పోరాడిన దేశ సైనిక పాటవాన్ని ప్రదర్శిస్తూ కలికిరి సైనిక్ స్కూల్ చేసిన నత్యాలు దేశభక్తిని ప్రేరేపించాయి. మదనపల్లికి చెందిన పీపల్ ట్రీ స్కూల్ వారు స్వాతంత్ర సమరయోధులు, మహాత్ములను, మహనీ యుల వేషధారణలతో విద్యార్థులు చేసిన నత్యం అందరిని ఆకట్టుకున్నాయి. కలికిరి సైనిక్ పాఠశాలకు ప్రథమ బహుమతి, మదనపల్లె పీపల్ ట్రీ స్కూలుకు ద్వితీయ బహుమతి, రాయచోటి శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్ వారికి తతీయ బహుమతి అందజేశారు. ఉత్తమ శకటాల ప్రదర్శనలో భాగంగా జిల్లా నేటి యాజమాన్య సంస్థ డ్వామాకు ప్రథమ బహుమతి, దిశ వాహనానికి ద్వితీయ బహుమతి, రాయచోటి నగరపాలక సంస్థకు తతీయ బహుమతి లభించింది. అనంతరం పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించినందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డులు అందుకున్న పోలీసు శాఖ అధికారులు, సిబ్బందికి అభినం దనలు తెలియజేయడంతో పాటు, సేవ పతకం, ప్రశంసా పత్రాలు అందజే శారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, అవార్డులు, బహుమతులను ఇంఛార్జి మంత్రి బహుకరించారు.
సంక్షేమ పథకాలపై ఎగ్జిబిషన్ల ఏర్పాటు: పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో వివిధ ప్రభుత్వ శాఖలు సంక్షేమాభివద్ది కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కలెక్టరు గిరీష, ఎస్‌పి గంగాధరరావు, జెసి ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఆర్‌ఒ సత్యనారాయణ, ఆర్‌డిఒలు, జిల్లా అధికారులు సందర్శించారు.అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా పశుసంవర్ధక, మత్స్యశాఖ, జిల్లా ఉద్యాన శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ, మెప్మా, జిల్లా గహ నిర్మాణ శాఖ, జిల్లా చేనేత జౌళి శాఖ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవద్ధులు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, ఎగ్జిబిషన్ స్టాల్స్ లను ఏర్పాటు చేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో వివిధ ప్రభుత్వ శాఖలు అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించిన అనంతరం రూ.1.12 కోట్ల విలువైన ఆస్తులను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఇందులో పరిశ్రమల శాఖ తరపున జగనన్న బడుగు వికాసం పథకం కింద సుమారు రూ.47 లక్షలు సబ్సిడీ విలువతో తొమ్మిది కార్లను, వ్యవసాయ శాఖ తరఫున రూ.42 లక్షలతో 7 ట్రాక్టర్‌లను, మత్స్యశాఖ ద్వారా రూ.2.60 లక్షల సబ్సిడీతో ఒక ఆటో రూ.20 లక్షల రాయితీతో 25 మంది లబ్దిదారులకు డ్రిప్ పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం జాతీయ గీతాలాపనతో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాలు ముగిశాయి.










