ప్రజాశక్తి - పరవాడ
కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో శుక్రవారం అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. పరవాడతో పాటు మండలంలోని 7 హాస్టళ్లను మండల ప్రత్యేకాధికారి కె.వీరన్ననాయుడు, ఎంపీడీవో హేమ సుందర్‌రావు సందర్శించారు. పరవాడ, లంకెలపాలెం, తానాం, వాడచీపురపల్లి బిసి బాలుర వసతి గృహాలు, తానాం ఎంజెపి ఏపిబిసిడబ్ల్యూఆర్ బాలికల స్కూల్, కాలేజీ, వాడచీపురపల్లి జిఎస్‌డబ్ల్యూ బార్సు హాస్టల్, పరవాడ జిఎస్‌డబ్ల్యూ గర్ల్స్ హాస్టల్ తదితర వసతి గృహాల్లో తనిఖీలు చేశారు. విద్యుత్, తాగునీరు, టాయిలెట్స్ పరిశీలించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తెలుసుకున్నారు. ఈ నివేదికలను జిల్లా కలెక్టర్‌కు ఇవ్వనున్నట్లు ఎంపిడిఒ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సునీత తదితరులు పాల్గొన్నారు. ఏడబ్ల్యుఎస్, మండల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దేవరాపల్లి : మండలంలోని తెనుగుపూడి అంబేద్కర్ గురుకుల పాఠశాల, బేతపూడిలోని కస్తూరిబా గాంధీ విద్యాలయం, దేవరాపల్లిలోని బీసీ బాలుర హాస్టల్‌ను మండల ప్రత్యేక అధికారి వి. రవీంద్రనాథ్, ఎంపీడీవో సిహెచ్ సుబ్బలక్ష్మి, ఈవోపిఆర్‌డి ఉషశ్రీ శుక్రవారం తనిఖీలు చేశారు. హాస్టల్లో ఉన్న విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు గురుకుల పాఠశాలలో సమస్యలు గుర్తించారు. హాస్టల్ స్టోర్ రూమ్‌లో సరుకులు నాణ్యతను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. గుర్తించిన సమస్యలను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపిస్తామని ప్రత్యేక అధికారి తెలిపారు.










