Mar 08,2023 20:03

మాట్లాడుతున్న పిడిఎస్‌యు నాయకులు

సంక్షేమ వసతి గృహాలకు సన్న బియ్యం అందించాలి : పిడిఎస్‌యు

ప్రజాశక్తి - నందికొట్కూరు

సంక్షేమ వసతి గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం అందించాలని పిడిఎస్‌యు నాయకులు అన్నారు. బుధవారం మండలంలో ని బ్రాహ్మణ కొట్కూరు ప్రభుత్వ బీసీ బాలుర సంక్షేమ వసతి గృహాన్ని పిడిఎస్‌యు బృందం సందర్శించింది. ఈ సందర్బంగా పిడిఎస్‌యు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి పి.మర్రిస్వామి మాట్లాడుతూ సిఎం జగన్‌ అధికారంలోకి రాకముందు విద్యార్థులకు సన్న బియ్యం సప్లై చేస్తామని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల గురించి మరిచిపోయారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యాన్ని సప్లై చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు రాము, ఈశ్వర్‌, బిట్టు, తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.