పుట్టపర్తి అర్బన్ : జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గహాలను అభివద్ధి చేయడానికి అవసరం అయ్యే కార్యాచరణ పనులకు నివేదికలు సిద్ధం చేయాలని హిందూపురం పార్లమెంట్ సభ్యుడు, దిశా ఛైర్మన్ గోరంట్ల మాధవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో సత్యసాయి జిల్లా అభివద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంపీ అధ్యక్షత జరిగిన సమావేశంలో దిశా కమిటీ కార్యదర్శి కలెక్టర్ అరుణ్ బాబు, సభ్యులు పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్, జెడ్పీ సీఈవో కేతన్ గార్గే, సచివాలయాలను నోడల్ అధికారి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివద్ధి సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలన్నారు. జలజీవన్ మిషన్, తాగునీరు, వైద్య ఆరోగ్య సేవలు, ప్రభుత్వ పథకాలకు బ్యాంకు లింకేజీ, పంచాయతీ రోడ్లుభవనాలు, జాతీయ రహదారులు, రోడ్డు పనుల పురోగతి, వైకెపి, మెప్మా పనితీరు, ఎంపీ లార్డ్స్, వ్యవసాయం, ఉద్యానవన, మైనర్ ఇరిగేషన్, శ్రీ శిశు సంక్షేమ, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు ఆసుపత్రుల్లో తగిన అభివద్ధి చేయాలన్నారు. డిఆర్‌డిఎ, మెప్మా అర్హత కలిగిన వారికి బ్యాంకు రుణాలు ఇచ్చేలా చూడాలని లబ్ధిదారులకు అవగాహన కల్పించి కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. జిల్లాలో ఎంపీ నిధుల కింద మంజూరైన పనులను ఎలాంటి పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని పనులకు నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. మగ్గాలపై ఆధారపడిన అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా ఉపాధి పనులు కల్పించాలన్నారు. జెడ్పీ సీఈవో కేతన్ గార్గ్ మాట్లాడుతూ, పీఎం కిసాన్ పథకంలో సిసిఆర్‌సి కార్డులు కలిగి ఉన్న కౌలు రైతులకు కూడా పిఎం కిసాన్ వర్తింపచేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరుకు కషి చేయాలని ఎంపీ మాధవను కోరారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ కౌలు రైతులకు కూడా ఈ పథకం అమలు అయ్యే విధంగా పార్లమెంట్‌లో చర్చిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎంపీ గోరంట్ల మాధవ్ సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలల్లో 20 శాతం అడ్మిషన్లు కల్పించాలని జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో లలితబాయి, సిపిఒ విజరు కుమార్, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ రషీద్‌ఖాన్, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్‌వి.కృష్ణారెడ్డి, విద్యాశాఖ అధికారి మీనాక్షి, ఐసిడిఎస్ పీడీ లక్ష్మి కుమారి సంబంధిత జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.