Nov 05,2023 23:09

టెక్కలి రూరల్‌ : మాట్లాడుతున్న కృష్ణదాస్‌

ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌: పేద ప్రజలకు సంక్షేమ వారధిగా జగన్‌ నిలిచారని వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. స్థానిక ఎస్‌ కన్వెన్షన్‌ హాల్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సిఎం జగన్‌ మేనిఫెస్టోలో వంద శాతం అమలు చేశారని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై దృష్టిసారించారని పేర్కొన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేశారని అన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలు, సదుపాయాలు కల్పించారని అన్నారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందజేస్తున్నామని అన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా సచివాలయం ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. పేదలందరికీ జగనన్న ఇళ్లు మంజూరు చేశారని అన్నారు. అనంతరం టెక్కలి డీగ్రీ కళాశాల నుంచి సామాజిక సాధికార బస్సు యాత్రతో బైక్‌ ర్యాలీ నిర్వహించి పలాస వెళ్లారు. సమావేశంలో వైసిపి ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి శాంతి, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేడాడ తిలక్‌, జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: సామాజిక న్యాయాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డేనని వైసిపి మండల అధ్యక్షులు నూక సత్యరాజు అన్నారు. మండలంలోని ఎంపిటిసిలు, సర్పంచ్‌ నాయకులు సామాజిక సాధికార బస్సు యాత్రకు సంఘీభావంగా బైక్‌ ర్యాలీ నిర్వహించి టెక్కలి చేరుకున్నారు. ముందుగా పిఎసిఎస్‌ అధ్యక్షులు బాడాన మురళి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల విప్‌ బొడ్డు అప్పన్న, సర్పంచ్‌లు కాళ్ల సంజీవరావు, బోయిన కృష్ణారావు, బలగ సూర్యారావు, బమ్మిడి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
నందిగాం : వైసిపి చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు నందిగాంలో వైసిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. పలాస వెళ్తున్న బస్సు యాత్రకు నందిగాం వద్ద కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌, ఎంపిపి నడుపూరు శ్రీరామ్మూర్తి, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు బైకులతో నందిగాం నుంచి పలాస వరకు ర్యాలీ వెళ్లారు.