ప్రజాశక్తి-ఆదోనిరూరల్
వాలంటీర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారు సంక్షేమ సేవకులుగా మన్ననలు పొందుతున్నారని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ తెలిపారు. బుధవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ఆవరణంలో ఎంపిపి దానమ్మ అధ్యక్షతన, ఎంపిడిఒ గీతావాణి ఆధ్వర్యంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మంచి పేరు తెచ్చేలా వాలంటీర్లు పని చేస్తున్నారని, ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్రలుగా వారిని సత్కరించడం, నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న వాలంటీర్లకు నిజమైన వందనాలని అన్నారు. ఇప్పుడు పురస్కారం పొందలేని వాలంటీర్లు పోటీ పడి ఉత్తమ సేవలు అందించి వచ్చే సంవత్సరం పురస్కారం అందుకునేలా కృషి చేయాలని తెలిపారు. మండలం మొత్తం 35 సచివాలయాలకు గాను సేవా మిత్రలుగా 436 మంంది, సేవా రత్నాలుగా 5గురు, సేవా వజ్రలుగా ఇద్దరికి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేసి సన్మానించారు. సర్పంచులు ప్రహ్లాద యాదవ్, నారాయణ, రాము, రామాంజనేయులు, రాంకోట్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఎంఇఒ శివరాములు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ నాగమల్లయ్య, పంచాయతీరాజ్ ఎఇ మాలిక్, ఇఒఆర్‌డి నాగరాజ్, వైసిపి సీనియర్ నాయకులు నరసింహమూర్తి, గురునాథ్ రెడ్డి, మండగిరి శేషిరెడ్డి, వీరేష్, మెడికల్ నాగరాజు, గర్జప్ప పాల్గొన్నారు. కౌతాళం ఎంపిడిఒ కార్యాలయంలో వాలంటీర్లను సన్మానించారు. మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మాట్లాడుతూ... నిస్వార్థ సేవకులుగా పని చేసి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పాలనలో పాలు పంచుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. సింగిల్‌విండో అధ్యక్షులు దాట్ల కృష్ణంరాజు, వైసిపి మండల కన్వీనర్ దేశాయి ప్రహ్లాద చారి, జడ్‌పిటిసి రాధా ప్రియదర్శిని, వైస్ ఎంపిపి బుజ్జి స్వామి, కోఆప్షన్ సభ్యులు మాబు సాబ్, సర్పంచి పాల్ దినకరన్, నాయకులు అవతారం, వడ్డే రాముడు, అబ్దుల్ సమద్, పాండురంగారెడ్డి, సోమిరెడ్డి, తహశీల్దార్ రామేశ్వర్ రెడ్డి, ఎంపిడిఒ శేఖర్ పాల్గొన్నారు. చిప్పగిరి మండల కార్యాలయంలో ఎంపిడిఒ సుధాకర్ రాజు, పంచాయతీ కార్యదర్శి బాలన్న ఆధ్వర్యంలో వాలంటర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. సేవా మిత్ర, సేవా రత్న, సేవావజ్ర పతకాలను ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ, సొసైటీ ఛైర్మన్ మల్లికార్జున, మండల ప్రత్యేకాధికారి వేణుగోపాల్, తహశీల్దార్ లక్ష్మీనారాయణ చేతులమీదుగా వాలంటీర్లకు అందజేశారు. ఎపిఎం నాగార్జున, ఎపిఒ మాధవ శంకర్, అసెంబ్లీ బూత్ కన్వీనర్ రాజన్న పాల్గొన్నారు.










