కొండాపురం : ప్రజా సంక్షేమమే జగన్మోహన్‌రెడ్డి లక్షమని, సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన నవరత్నాలు అమలు చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి కట్టిన పన్నులను తిరిగి వారికే చేరవేస్తున్నారని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏడాదికి రూ. రెండు లక్షల చొప్పున వసూలు చేసిన పన్నులు ఎక్కడా ఖర్చు పెట్టకుండా పాలకులే దోచేశారని విమర్శించారు. వై.ఎస్. రాజశేఖ ర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నారని తెలిపారు. సచివాలయ వ్యవస్థను తీసకొచ్చి ప్రజలకు అన్ని రకాల సంక్షేమ ఫలాలు వాలంటీర్ల ద్వారా అందజేస్తున్నారని చెప్పారు. ఎంపిడిఒ నాగ ప్రసాద్ మాట్లాడుతూ లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను జగనన్న సురక్ష పథకం ద్వారా అందజేస్తున్నామని పేర్కొన్నారు. కొండాపురం పంచాయతి పరిథిలో833మందికి రేగడిపల్లి సచివాలయం పరిధిలోని 400 మందికి అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు సి.లక్ష్మీదేవి, ఉపాధ్యక్షులు కెవై చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపిడిఒ నాగప్రసాద్, మండల విద్యాశాఖ అధికారులు ఓబులేసు, రామయ్య, డిప్యూటీ తహశీల్దార్ మీనా, జడ్‌పిటిసి భారతి, మండల నాయకులు చింతా రాజారెడ్డి నరసింహారెడ్డి, డాక్టర్ నవజ్యోతిరెడ్డి, కె. పెద్దిరెడ్డి, దాదు రామకష్ణా రెడ్డి, జగదీశ్వర రెడ్డి, లక్మికాంత్ రెడ్డి, అశోక్ రెడ్డి, కొండు నాగార్జున రెడ్డి, కొండు రామిరెడ్డి, బుజ్జి,వి.రామాంజల్ రెడ్డి, మైనారిటీ నాయకుడు నన్నే, అల్లం సత్య,వై.శేఖర్, దామోదర్ రెడ్డి, ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్నారు. సిఐ సుదర్శన్ ప్రసాద్, ఎస్‌ఐ యోగేంద్ర ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేంపల్లె : జగనన్న సురక్షతో అర్హులకు న్యాయం చేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, ఎంపిపి లక్ష్మి గాయత్రీ, వైసిపి మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక 7వ గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష గ్రామ సభ నిర్వహించారు. ప్రజలకు కావాల్సిన సర్టిఫికెట్లును ఎంపిపి, సర్పంచ్, మండల కన్వీనర్లు కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిటిసిలు భారతి, కటిక చంద్రశేఖర్, రాజ్‌కుమార్, వార్డు సభ్యుడు ముత్యాల ఆంజనేయులు, భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ సల్మా , వైసిపి యూత్ అధ్యక్షుడు రవిశంకర్ గౌడ్, సచివాలయ కన్వీనర్ ముత్యాల రమేష్ బాబు, అయ్యవారిపల్లి సర్పంచ్ రామగంగిరెడ్డి, ఎంపిడఒ మల్లికార్జునరెడ్డి, గ్రామ సచివాలయ సిబ్బంది, వైసిపి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. చాపాడు : జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉపయోగం అని ఎంపిపి టి లక్షుమయ్య తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని సోమాపురంలో జగనన్న సురక్ష గ్రామసభను నిర్వహించారు. పంచాయతీ పరిధిలో 634 మందికి వివిధ రకాల దవీకరణ పత్రాలు అందించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సురేష్‌రెడ్డి, తహశీల్దార్ సుభాని, సచివాలయాల కన్వీనర్ల మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, ఎఒ రామాంజనేయులు, సర్పంచ్ శ్రీనువాసుల రెడ్డి, మాజీ సర్పంచులు రామాంజనేయులరెడ్డి, హజరత్‌రెడ్డి, అంగన్వాడీ సూపర్‌వైజర్ సుబ్బరత్నమ్మ, ఉపాధి ఎపిఒ పద్మారాణి, పంచాయతీ కార్యదర్శి పద్మావతి పాల్గొన్నారు. పులివెందుల టౌన్ : ప్రజల ప్రతి సమస్యకూ పరిష్కారాన్ని చూపేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సురక్ష పథకాన్ని ఏర్పాటు చేశారని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్బిఐ వార్డు సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 1180 వివిధ కుల, ఆదాయ, వివాహ, ఇతర 11 రకాల దృవీకరణ పత్రాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ హాపీజ్ , లక్ష్మి భార్గవి, రమాంజనమ్మ, కోడి రమణ , రాష్ట్ర సివిల్ సప్లరు డైరెక్టర్ హాల్ గంగాధరరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోటూరు చిన్నప్ప, దూదేకుల సంఘ అధ్యక్షులు ఓ.రసూల్, జగనన్న కన్వీనర్లు, గహ సారతుల ఇంచార్జి చంద్ర మౌళి, డిప్యూటీ తహశీల్దార్ సుజిత్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.










