Sep 12,2023 23:48

ప్రజాశక్తి -  చీరాల
ప్రభుత్వం అర్హత కలిగిన లబ్ధిదారులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను  సద్వినియోగం చేసుకోవాలని 5వ వార్డు కౌన్సిలర్ సూరగాని లక్ష్మీ అన్నారు. ఆమె వార్డులో మంగళవారం పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు. ఆ వార్డులో నూతన పింఛన్లకు అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో సిఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. వృద్ధులకు విడతల వారీగా రూ.3వేల వరకు పెన్షన్ పెంచి బాసటగా నిలిచారని అన్నారు. అర్హత ఉండి పెన్షన్‌ రాని వాళ్లు ఉంటే దరకాస్తు చేసుకోవాలని కోరారు. ఏమైనా సమస్యలు తన దృష్టికి తేవాలని కోరారు. ఆమె వెంట సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఉన్నారు.