Jun 06,2023 23:56
మాట్లాడుతున్న ఎంపిపి లలితకుమారి

ప్రజాశక్తి-భట్టిప్రోలు: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేవిధంగా చూడాలని ఎంపిపి డివి లలితకుమారి సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం మండల సమాఖ్య కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండల సమాఖ్య అధ్యక్షురాలు కర్రా స్వరాజ్యం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపిపి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న జగనన్న తోడు, బడుగు వికాసం, ఆసరా, చేయూత, హౌసింగ్‌ రుణాలు వంటి పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా డ్వాక్రా మహిళలు కృషి చేయాలని అన్నారు. ఏరియా కో ఆర్డినేటర్‌ ఎ రమాదేవి మాట్లాడుతూ తీసుకున్న అన్ని రకాల రుణాలు రికవరీ అయ్యే విధంగా చూడాలన్నారు. మండలంలో ఉన్న 40 మంది యానిమేటర్లు క్రమం తప్పకుండా గ్రామ సంఘాల సమావేశాలు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం శ్రీమన్నారాయణ, స్త్రీ నిధి మేనేజర్‌ అశోక్‌, సిసిలు హనోక్‌, రజని, సాంబయ్య, ఎకౌంటెంట్‌ శిరీష తదితరులు ఉన్నారు.