ప్రజాశక్తి - కొత్తవలస : ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. మండలంలో నూతనంగా మంజూరైన పెన్షన్లు ఎంపిడిఒ వై. పద్మజ ఆధ్వర్యంలో ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో నూతనంగా 392 పింఛన్లు మంజూరయ్యా యన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగనన్నకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, కొత్తవలస మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి, పిఎసిఎస్ అధ్యక్షుడు గొరపల్లి శివ, వైస్ ఎంపిపి కర్రీ శ్రీను, వైసిపి మండల అధ్యక్షులు ఒబ్బిన నాయుడు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల : సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి వైసిపి ప్రభుత్వం పునాది వేస్తుందని జెడ్‌పిటిసి గదల సన్యాసి నాయుడు అన్నారు. బుధవారం కొండవెలగాడలో వైఎస్‌ఆర్ పింఛను కానుకలో 2వ విడత మంజురైన 13 మంది ఆయన పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 300 పింఛన్లు ఉండగా ఈ ప్రభుత్వం వచ్చిన తరువాతో అదనంగా మరో 315 పింఛన్లు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మొయిద అక్కోజీ, వల్లూరి రాము, రేవల్ల సింహచలం, పంచాయతి కార్యదర్శి యర్ర రమణ, వెల్ఫేర్ అసిస్టెంట్ కె. గోవిందరావు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం: మండలంలోని ద్వారపూడిలో నూతనంగా మంజూరైన పింఛన్లను ఎంపిపి మామిడి అప్పలనాయుడు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛను అందించే బాధ్యతను సిఎం జగన్మోహన్‌రెడ్డి తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బూడి ప్రవీణ్, జామి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.










