Nov 10,2023 23:52

మాట్లాడుతున్న వరికూటి అశోక్‌బాబు

ప్రజాశక్తి - టంగుటూరు : రాష్ట్రం అన్ని రంగాలలో సమగ్రాభివద్ధి సాధించాలంటే ఈ రాష్ట్రానికి జగనే మళ్లీ సిఎంగా ఉండాలని వైసిపి కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌ బాబు ఉద్ఘాటించారు. టంగుటూరు-2 సచివాలయం వద్ద వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌ బాబు మాట్లాడుతూ నిరుపేదల జీవన ప్రమాణాలు మరింతగా అభివద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రాష్ట్రానికి మళ్లీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. గత నాలుగున్నరేళ్లలో ప్రతి కుటుంబానికి జగనన్న పథకాలు అందాయన్నారు. లబ్ధి పొందని కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నాయా అని అశోక్‌ బాబు ప్రశ్నించారు. జగనన్న ప్రవేశపెట్టిన అభివద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలు ఆలోచించాలన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన అభివద్ధి సంక్షేమ పథకాల పట్టికను అశోక్‌ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ రత్నజ్యోతి, వైసిపి మండల అధ్యక్షుడు మల్లవరపు రాఘవరెడ్డి, జెసిఎస్‌ కన్వీనర్‌ చింతపల్లి హరిబాబు, వెలుగు ఎపిఎం హనుమంతరావు, ఇన్‌ఛార్జి సిడిపిఒ జ్యోతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పిసిపల్లి : మండల పరిధిలోని నేరేడుపల్లిలో సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు. అనంతరం లబ్ధిదారులు వివరాలతో కూడిన సంక్షేమ బోర్డును ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలు చేసినటు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అత్యాల జఫన్య , పిసిపిల్లి సొసైటీ అధ్యక్షుడు పోలు జయరాం రెడ్డి , జెసిఎస్‌ కన్వీనర్‌ శీలం సుదర్శనం, వైసిపి నాయకులు ఎర్రం రెడ్డి మోహన్‌ రెడ్డి ,రవి తదితరులు పాల్గొన్నారు. యర్రగొండపాలెం : దళారులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందని ఎంపిపి దొంతా కిరణ్‌ గౌడ్‌ తెలిపారు. యర్రగొండపాలెం-2 సచివాలయం పరిధిలో ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి దొంతా కిరణ్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఈ సచివాలయ పరిధిలో 1500 మంది లబ్ధిదారులకు రూ.28,13,46,971 మేర లబ్ధి చేకూరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి విజరుభాస్కర్‌, వైసిపి మండల కన్వీనర్‌ కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, సర్పంచి అరుణాబాయి, వైసిపి నాయకులు షేక్‌ వలి, వెంకటేశ్వరరెడ్డి, రాములు నాయక్‌, చెన్నకేశవులు, జబివుల్లా, వైసిపి సోషల్‌ మీడియా నియోజకవర్గ కో కన్వీనర్‌ షేక్‌ ఖాసింబాషా, తూమాటి రాంబాబు పాల్గొన్నారు. సిఎస్‌పురం : పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సిఎం జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని ఎంపిపి మూడమంచు వెంకటేశ్వర్లు తెలిపారు. సిఎస్‌పురం-2 సచివాలయం వద్ద రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పిస్తున్నారన్నారు. ఈ సంక్షేమ పథకాలు ఇంకా అభివద్ధి చెందాలంటే జగన్మోహన్‌ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ షేక్‌ నాగుర్‌ మీరా, ఎంపిడిఒ రామచంద్రరావు, వైసిపి మండల అధ్యక్షుడు భువనగిరి వెంకటయ్య, సిఎస్‌ పురం ఉప సర్పంచి పాములపాటి నరసయ్య, వైసిపి యూత్‌ అధ్యక్షుడు ఎం. అటేలయ్య, పెరుగు సుబ్బరామయ్య, బైరెడ్డి తిరుపతి రెడ్డి, వైసిపి నాయకులు అధికారులు పాల్గొన్నారు. శింగరాయకొండ : శింగరాయకొండ-2 సచివాలయం వద్ద వై నీడ్‌ ఏపీ జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు అంతంత మాత్రంగానే వచ్చారు. సర్పంచి తాటిపర్తి వనజ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ షేక్‌ జమీవుల్లా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం వైస్‌ ఎంపిపి సామంతుల రవికుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు రోడ్డులోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపిపి, జడ్‌పిటిసి, ఎంపిటిసిలు, వార్డు మెంబర్లు, వైసిపి నాయకులు దూరంగా ఉండటం పెద్ద చర్చిగా మారింది.కొండపి : వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరినట్లు మండల పరిధిలోని కట్టావారిపాలెం వైసిపి నాయకులు తెలిపారు. కట్టావారిపాలెంలో వైఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బి.సుబ్బారావు, ఆర్‌. కోటరాజు, రావెళ్ల రాజీవ్‌ చౌదరి, బొక్కిసం ఉపేంద్ర చౌదరి, ఎంపిడిఒ రమణమూర్తి, పంచాయతీ కార్యదర్శి బిళ్ల అంకయ్య, పూజిత తదితరులు పాల్గొన్నారు.