Jul 26,2023 21:58

లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేస్తున్న ఎంపిపి పద్మావతి

ప్రజాశక్తి - కురుపాం :  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తి చెందుతున్నారని ఎంపిపి శెట్టి పద్మావతి అన్నారు. బుధవారం బియ్యాలవలస సచివాలయంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో పెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఆర్‌.రమేష్‌కుమార్‌ , జడ్పిటిసి జి.సుజాత ,జిల్లా కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ నిషార్‌, వాణిజ్య విభాగాల జిల్లా అధ్యక్షులు శెట్టి నాగేశ్వరరావు, అయ్యరకల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జి.విజయ చంద్రశేఖర్‌, సర్పంచులు శెట్టి సురేష్‌, సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.