Nov 06,2022 23:53

మాట్లాడుతున్న ఎంపిపి బడుగు రమేష్‌

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌
ఇచ్చిన మాటకు కట్టుబడి తండ్రికి తగ్గ తనయుడిగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన ఘనత సిఎం జగన్‌ కే దక్కుతుందని ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. ఆదివారం ప్రజా సంకల్పయాత్రకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పాడేరు పట్టణంలోని పాత బస్‌స్టాండ్‌ అంబేద్కర్‌ కూడలి వద్ద వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రతిపక్షనేతగా 341 రోజులపాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టారన్నారు కార్యక్రమంలో ఎంపిపి సొనారి రత్నకుమారి, వైస్‌ ఎంపిపి కనకాలమ్మ, సర్పంచులు సిదరి రాంబాబు, గబ్బాడ చిట్టిబాబు, లకే పార్వతమ్మ, ఎంటిసిలు సూరిబాబు, నరసింహమూర్తి, చిట్టెమ్మ,పాల్గొన్నారు.
కొయ్యూరు : వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్య స్థాపన జరుగుతుందని ఎంపిపి బడుగు రమేష్‌ అన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రకు ఐదు వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కొయ్యూరు మండలం కొండగోకిరి పంచాయితీ గుజ్జిమానుపాకలు గ్రామంలో ఎంపీపీ రాజశేఖర రెడ్డి విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు వచ్చాయని, ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీరు సేవలందించడానికి వచ్చారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌, డిజిటల్‌ లైబ్రరీలు ఇలా ప్రతి గ్రామానికి విలువైన ఆస్తులు సమకూర్చబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు జల్లి బాబులు, రేగటి ముసలి నాయుడు, గాడి అచ్చిరాజు, పాటి శేఖర్‌, కొడ రాజుబాబు, పాటి చిన్నయ్య, రీముల గంగాధర్‌, రామరాజ్యం, బాబ్జి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.