ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
సంక్షేమ పథకాలతో పేదలందరికీ లబ్ధి చేకూరిందని వైసిపి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని 31వ వార్డు సచివాలయంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, వాటి ద్వారా పొందిన లబ్ధిని వివరించారు. వార్డు పరిధిలోని కొన్ని వీధుల్లో తాగునీటి సమస్య, సిసి రోడ్లు తదితర సౌకర్యాలు కల్పించాలని ప్రజలు ఆయన దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. ఈ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అన్ని వార్డుల్లో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళిక మేరకు సిసి రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలను చేపడుతున్నామని చెప్పారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఎఐఐబి స్కీం కింద మంజూరైన రూ.142 కోట్లతో పైపులైన్లు, ట్యాంకు నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అవి పూర్తయితే ఇంటింటికీ కుళాయిలు మంజూరు కానున్నట్లు వివరించారు.
సంక్షేమ పథకాల లబ్ధి పత్రాలను అందజేస్తున్న జగన్మోహన్‌రెడ్డి










