నిమ్మనపల్లి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఎమ్మెల్యే నవాజ్‌బాషా అన్నారు. ఆదివారం అగ్రహారం పంచాయతీలోని ఆరిపిరెడ్డిగారిపల్లి, పూలవాండ్లపల్లి, చింతపర్తివారిపల్లి, చెరువుముందరపల్లి గ్రామాలలో సర్పంచ్ వి.ఉషారాణి, వైసిపి నాయకులు యుగంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా పాల్గొన్నారు. ఎంపిపి నరసింహులు, సింగిల్ విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్‌రెడ్డి, మండల వైసిపి ఇన్‌ఛార్జి ఆర్‌ఐ రమణారెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ రామమోహన్ రెడ్డి, స్థానిక వైసిపి నాయకులతో కలిసి ప్రతి ఇంటిలోని లబ్ధిదారులను పలకరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పేదలకు, రైతులకు, మహిళలకు అండగా నిలబడే ప్రభుత్వమని అన్నారు. జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నా పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో ఎక్కడికి వెళ్లినా నేడు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ వారి ఇంటికి ఆహ్వానిస్తున్నారని అన్నారు. ప్రతి కుటుంబం దాదాపుగా ఐదు లక్షల రూపాయల వరకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిందని తెలిపారు. మంచి చేసిన జగనన్న ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ప్రజల స్వచ్ఛందంగా తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు సుబ్రమణ్యం, చండ్రాయుడు, మహదేవరెడ్డి, ఎంపిటిసి కుసుమ, నాయకులు దయాకర్‌రెడ్డి, యుగం ధర్‌రెడ్డి, సుధాకర, నరేంద్ర రెడ్డి, హేమంత్, శశిధర్ రెడ్డి, మౌలాలి, తహ శీల్దార్ ఆర్.మంజుల, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.










