Sep 16,2023 21:22

కొత్తవలస: బుక్లెట్‌ను అందిస్తున్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు

ప్రజాశక్తి - బొబ్బిలిరూరల్‌ : తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి చెందుతున్నారని ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు అన్నారు. శనివారం శివడవలసలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ళ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. ఇంటింటికి తిరిగి నాలుగేళ్లలో ప్రభుత్వం నుంచి పొందిన లబ్ది తెలియజేసిన బుక్‌ లెట్లు పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలు పొందిన లబ్దిని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శంబంగి లక్ష్మీ, నాయకులు వేణుగోపాలనాయుడు, జెడ్‌పిటిసి సంకిలి శాంతకుమారి, తహశీల్దార్‌ డి.రాజేశ్వరరావు, ఎంపిడిఒ రవి కుమార్‌, ఉప తహశీల్దార్‌ గౌరీశంకర్‌, జెసిఎస్‌ కన్వీనర్‌ తమ్మిరెడ్డి దామోదర్‌, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
కొత్తవలస: ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే వైసిపి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని తుమ్మకాపల్లిలో శనివారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి గడపలోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను వివరించారు. ఏమైనా సమస్యలుంటే తెలుసుకొని అక్కడికి అక్కడే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నీలం శెట్టి గోపమ్మ, జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, పిఎసిఎస్‌ చైర్మన్‌ గొరపల్లి శివ, జామి వైఎస్‌ఆర్సిపి కన్వీనర్‌ గొర్లె రవికుమార్‌, ఎల్‌ కోట ఎంపిపి గేదెల శ్రీనివాసరావు, ఎల్‌.కోట జిసిఎస్‌ ఇంచార్జ్‌ యెడ్ల కిషోర్‌, స్థానిక సర్పంచ్‌ విరోతి కొండలరావు, ఎంపిటిసి పిల్లా లక్ష్మి, ఈశ్వర్‌ రావు, పిల్లా అచ్చలు, సంతపాలం బిఏ నాయుడు, సచివాలయం కన్వీనర్‌ సిహెచ్‌ ఆనందరావు, లెంక భాస్కరరావు, సీతారాంపురం ఎంపిటిసి గుమ్మడి సన్యాసప్పుడు, సోషల్‌ మీడియా నియోజకవర్గ కో కన్వీనర్‌ కర్రీ దేవుడు బాబు, మండల సోషల్‌ మీడియా కన్వీనర్‌ అడిగర్ల సంతోష్‌ కుమార్‌ పాల్గొన్నారు.