ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభ్యున్నతి సాధిస్తున్నారని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నందవరం మండలంలోని జోహారాపురం గ్రామానికి చెందిన పల్లె శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపికి చెందిన సుమారు 80 మంది ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. ఎర్ర నరసింహులు, కె.నాగేంద్ర, కురువ మల్లేష్, కె.నాగరాజు, కె.పరమేష్, కె.అనుమమ్మ, కె.రమేష్, కె.యంకప్ప, కె.బుడ్డప్ప, కె.బుడ్డ నరసన్న, కె.శంకరప్పలు వైసిపిలో చేరారు. వారికి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పథకాలకు ఆకర్షితులై, టిడిపికి మనుగడ ఉందని గ్రహించి వైసిపిలో చేరినట్లు తెలిపారు. వైసిపిలో చేరిన వారికి తగిన గుర్తింపునిస్తామని, వైసిపి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరుతున్న నాయకులు










