May 20,2023 19:48

బుక్‌లెట్‌ను అందజేస్తున్న ప్రదీప్‌రెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందడం వల్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని వైసిపి రాష్ట్ర యువజన నాయకులు వై.ప్రదీప్‌ రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని మాలపల్లి గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికీ తిరిగి జగనన్న నాలుగేళ్ల పాలనలో సంక్షేమ పథకాల అమలు తీరు గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్‌ లెట్‌ అందజేసి వైసిపికి మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా షాదీ తోఫా గోడపత్రికను ఆవిష్కరించారు. వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్‌ రెడ్డి, మాజీ జడ్‌పిటిసి లక్ష్మయ్య, నాయకులు గురురాజారావు, ఎంపిడిఒ ప్రభావతి పాల్గొన్నారు.