అవగాహన కల్పిస్తున్న జడ్పిటిసి
ప్రజాశక్తి-హుకుంపేట:అర్హత ఉన్న ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు పొందాలని జెడ్పిటిసి రేగం మత్య్స లింగం కోరారు. మండలంలోని మారుమూల దుర్గం పంచాయతీలో జెడ్పీటీసీ రేగం మత్య్సలింగం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల గ్రామాల్లో ఆరోగ్యం, విద్యా, రోడ్లు, పారిశుధ్యం వంటి వాటిపై ప్రజలతో సమీక్ష నిర్వహించారు. సమస్యలను అధికార్ల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం కోసం తగిన కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ వెంకటరావు, మధు, మంగళయ్య, సూరిబాబు పాల్గొన్నారు.










