రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
ప్రజాశక్తి-మారేడుమిల్లి
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు ఉపయోగించుకోవాలని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. మండలంలోని పాములేరు పంచాయితీ పరిధిలోని ఎల్లివాడ, కాకురూ, కొత్తవీధి, పాములేరు, కుర్రవాడ గ్రామాల్లో మంగళవారం ఆమె గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఇంటింటి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు తీరు అడిగి తెలుసుకున్నారు. ఎల్లివాడ, కాకూరు గ్రామానికి రహదారి నిర్మించి, తాగునీటి సదుపాయం కల్పించాలని, కాకురు నుంచి కొత్తవీధికి మార్గమధ్యలో పాములేరు వాగుపై రోప్ బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సార్ల అతిత కుమారి, జెట్పీటీసీ సభ్యుడు గొర్రె బాలాజీ బాబు, వైస్ ఎంపీపీ లక్కోండ రవికుమార్, కో-ఆప్షన్ సభ్యుడు గురుకు దర్మరాజు, మారేడుమిల్లి సర్పంచ్ కొండ జాకబ్, పార్టీ మండల కన్వీనర్ సత్తి సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి గంగరాజు, యూత్ అధ్యక్షుడు గొర్రె బాలీ, నాయకులు సార్ల లింగారెడ్డి దూడ స్మిత్, సత్తి సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










