
ప్రజాశక్తి-హిందూపురం : అర్హులైన ప్రతి ఒక్కరు జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దీపిక అన్నారు. బుధవారం పట్టణంలోని 10వ వార్డులోని కృష్ణ లేఅవుట్, లక్ష్మిపురం ప్రాంతాల్లో గడప డగపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె ఇంటింటికి వెళ్లి ప్రభుత్వసంక్షేమ పథకాల అమలుతీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇ వెంకట రమణ, డిఇఇ బాల సుబ్రమణ్యం, కౌన్సిలర్లు జయప్ప, షాజియా, వైసిపి నాయకులు శ్రీరామి రెడ్డి, కవిత, డిష్ చాంద్, ఇలియాజ్, సోమశేఖర్ రెడ్డి, శివన్న తదితరులు పాల్గోన్నారు.
సచివాలయం తనిఖీ : పట్టణంలోని10వ వార్డు సచివాలయాన్ని ఇన్‌చార్జ్ దీపిక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా సచివాలయ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.