
హిందూపురం : ప్రభుత్వం ప్రజల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ సమన్వయ కర్త, ఇన్‌ఛార్జి దీపిక అన్నారు. సోమవారం పురపాలక సంఘంలోని 10వ వార్డు లక్ష్మిపురంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో కలిసి దీపిక గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ జబివుల్లా, కౌన్సిలర్లు షాజియా, నాయకులు సాధిక్, నాగమణి, మల్లిక, శివన్న, ఇలియాజ్, నాగరాజు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గహ సారథులు పాల్గోన్నారు.