Sep 02,2023 22:11

మాట్లాడుతున్న మల్లి

మాట్లాడుతున్న మల్లి
సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి
ప్రజాశక్తి-జలదంకి: దళిత గిరిజనులకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ దళిత సంఘర్షణ సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్‌ మల్లి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం ప్రకారం 342 ఆర్టికల్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ డెవలప్మెంట్‌ నిధులను అమ్మ ఒడికి మళ్లించి, నారాయణ, భాష్యం, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివే ఉన్నత వర్గాల వారికి మళ్లించి తమ కడుపులు కొట్టడం అన్యాయం అన్నారు. తహశీల్దార్‌ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వి.మహేంద్ర దొర, బి.వాసు, ఎన్‌.విల్సన్‌, ఎం. అనిల్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


.