Feb 25,2023 19:49

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గంగుల

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : ఎమ్మెల్యే
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ

       ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి వివరించాల్సిన బాధ్యత గృహ సారధులదేనని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. శనివారం స్థానిక మహాలక్ష్మి ఫంక్షన్‌ హాల్‌లో గృహ సారుదులు, కన్వీనర్లు, వాలంటీర్లతో వర్క్‌షాప్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిశీలకులు బోరెడ్డి నరసింహారెడ్డి, నంద్యాల మిల్క్‌ డైరీ చైర్మన్‌ ఎస్వి జగన్మోహన్‌ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే విషయంపై దిశా నిర్దేశం చేశారు. గృహ సారథులు, కన్వీనర్లు, వాలంటీర్లు అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. నూటికి 94 శాతం హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు వివరించాలన్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిశీలకులు బోరెడ్డి నరసింహారెడ్డి, విజయ మిల్క్‌ డైరీ చైర్మన్‌ ఎస్‌.వి జగన్‌ మోహన్‌ రెడ్డిలు మాట్లాడారు. సమావేశంలో ఎంపిపి గజ్జల రాఘవేంద్రారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాయబ్‌ రసూల్‌, మండల ఉపాధ్యక్షులు నాసారి ప్రసాద్‌, దాదాపీర్‌, కౌన్సిలర్‌ గొట్లూరు సుధాకర్‌ రెడ్డి, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు రమేష్‌ గౌడ్‌, యాదవాడ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.