Oct 07,2023 20:46

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు

ప్రజాశక్తి- నెల్లిమర్ల : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సూచించారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో 'ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి'? అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కార్యక్రమం విధి విధానాలను పార్టీ శ్రేణులకు తెలియజేశారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయి నుంచి కృషి చేయాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మాయమాటలు చెప్పేందుకు జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి వస్తున్నాయని వాళ్లకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అంబళ్ల సుధారాణి, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే బోర్డు సలహా మండలి సభ్యులు అంబళ్ళ శ్రీరాములు నాయుడు, జెడ్‌పిటిసి గదల సన్యాసినాయుడు, వైసిపి మండల అధ్యక్షుడు చనమల్ల వెంకటరమణ, వైస్‌ ఎంపిపిలు సారిక వైకుంఠ నాయుడు, పతివాడ సత్యనారాయణ, నాయకులు దంతలూరి జోగి జగన్నాథరాజు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కార్పొరేషన్‌ డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.