ప్రజాశక్తి -పార్వతీపురం టౌన్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరి చేసేందుకే జగనన్న సురక్ష పథకం లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే ఎ.జోగారావు అన్నారు. పట్టణంలోని శంఖావీధి, రాజుగారికోట, బొగ్గులవీధి సచివాలయంలం పరిధిలో గల 23, 23, 25, 26, 27, 28, 29 వార్డులకు చెందిన ప్రజలకు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ జె.రామ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆర్య వైశ్య ఫంక్షన్ హాల్ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా మూడు సచివాలయాల పరిధిలో గల జగనన్న సురక్ష పథకం ద్వారా జారీ చేసిన 11రకాల ధ్రువీకరణ పత్రాలను సుమారుగా 1500 మందికి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ఒక్కరు, ఏ కుటుంబమూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదన్న ఏకైక లక్ష్యంతో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బి గౌరీశ్వరి, వైస్ చైర్మన్ యిండుపూరు గున్నేశ్వరరావు, పార్టీ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, మాజీ వైస్ చైర్మన్ బెలగాం జయబాబు, స్థానిక వార్డుల కౌన్సిలర్లు మంత్రి ఉమామహేశ్వరి, మజ్జి శషికర్, నిమ్మకాయల సుధీర్, వై.త్రినాథ, తాడ్డి శంకరరావు, ఎస్.లావణ్య, జెసిఎస్ కన్వీనర్ జి.మాధవరావు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్ : మండలంలోని డోకిశీల, డికె పట్నం సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు సుమారు 1200 మంది లబ్ధిదారులకు వివిధ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎస్.రమేష్, తహశీల్దార్ శివన్నారాయణ, ఇఒపిఆర్‌డి ఎన్.కృష్ణుడు, ఎంపిపి మజ్జి శోభారాణి, వైస్ ఎంపిపిలు సిద్ధా జగన్నాధరావు, బంకురు రవికుమార్, ఆత్మ చైర్మన్ వై తిరుపతిరావు, మండల పార్టీ అధ్యక్షులు, బొమ్మి రమేష్ నాయకులు, భీమవరపు కృష్ణమూర్తి మడక విశ్వనాథం, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
కురుపాం : మండలంలోని ఊసకొండ పంచాయతీ పొడ్డిశ సచివాలయం వద్ద జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బి.సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు అర్హులై ఉండీ ఇంకా మిగిలిన వారు జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసుకుంటే వెంటనే పరిష్కారమవుతుందని, కావున లబ్ధిదారులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ వి వి శివ రామప్ప, ఉప తహశీల్దార్ నాగేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
వండువలో నేడు జగనన్న సురక్ష
వీరఘట్టం : మండలంలోని వండువ, సంతనర్సిపురంలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపిడిఒ జి.జయంత్‌ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయి అధికారులంతా సమయం పాటించి ఉదయం 10 గంటలకు విధిగా హాజరు కావాలని ఆయన కోరారు.










