May 19,2023 19:48

అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్‌పిటిసి విరుపాక్షి

ప్రజాశక్తి - చిప్పగిరి
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైసిపి గెలుపునకు పునాది అవుతాయని ఉమ్మడి జిల్లాల పంచాయతీరాజ్‌ వింగ్‌ అధ్యక్షులు, జడ్‌పిటిసి విరుపాక్షి తెలిపారు. శుక్రవారం అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను వారి కార్యాలయంలో జడ్‌పిటిసి విరుపాక్షి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అభివృద్ధిపై, సంక్షేమ పథకాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల కోసం ఇంటి స్థలాలను ప్రభుత్వం అందిస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు ఒక్క సెంటు ఏం పనికొస్తుందని, సమాధి కూడా ఆ స్థలంలో కట్టలేమని ఎగతాళి చేస్తున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఎప్పుడైనా స్థలాలిచ్చి కట్టించారా అని ప్రశ్నించారు. మాజీ ఎంపిటిసి మల్లికార్జున, వైసిపి నాయకులు నాగప్ప, పెద్దయ్య, జ్ఞాన్‌ పాల్గొన్నారు.