Jul 13,2023 21:56

మాట్లాడుతున్న నాగార్జునరెడ్డి

పోరుమామిళ్ళ టౌన్‌ : ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రభుత్వ సలహాదారుడు పి. నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని అక్కల రెడ్డిపల్లిలో జగనన్నసురక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుండి 2023 వరకు సంక్షేమ క్యాలెండర్‌లో ఉన్నట్లు అన్ని పథకాలు ప్రజలకు అమలు చేస్తున్నారని చెప్పారు. సచివాలయ వ్యవస్థలో 540 రకాల సేవలను తీసుకొచ్చారని చెప్నాపరు. అక్కలరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో భూములు ఆన్‌లైన్‌ కావడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అందుకు తహశీల్దార్‌ స్పందిస్తూ ప్రతి రైతుకు సంబంధించిన భూములను త్వరలో ఆన్‌లైన్‌ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రమౌళి, జడ్‌పిటిసి ముత్యాల ప్రసాద్‌, ఉప ఎంపిపి బాష, వైసిపి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కలసపాడు : మండలంలోని బ్రాహ్మణపల్లెలో గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా నిర్వహించారు. ఆమె ప్రతి ఇంటికీ వెళఙ్ల ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులై అందకపోతే తక్షణమే వారికి సంక్షేమ పథకాలు అందించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు కార్యక్రమంలో మండల స్పెషల్‌ ఆఫీసర్‌ మురళీధర్‌ రెడ్డి, ఎంపిడిఒ మహబూబ్‌బి, తహశీల్దార్‌ రవీంద్రారెడ్డి, జెఎస్‌సి మండల కన్వీనర్‌ చిత్త రాజశేఖర్‌ రెడ్డి, రాజుపాలెం సర్పంచ్‌ సుధా రామకష్ణారెడ్డి అధ్యక్షులు నిర్మలా నారాయణ మండల ఉపాధ్యక్షులు అన్నా రెడ్డి విజయభాస్కర్‌ రెడ్డి, జడ్‌పిటిసి అంకన్నగురివిరెడ్డి, కొత్తకోట సహకార సంఘ ప్రెసిడెంట్‌ పెద్దిరెడ్డి, పురుషోత్తంరెడ్డి, లిప్‌ క్యాప్‌ డైరెక్టర్‌ సగిలి సుదర్శనం, వైసిపి నాయకులు, కార్యకర్తలు, బూత్‌ కన్వీనర్లు, గహ సారధులు, ప్రజలు పాల్గొన్నారు చెన్నూరు : జగనన్న సురక్ష కార్యక్రమం చెన్నూరు గ్రామ సచివాలయం-2లో గురువారం నిర్వహించారు. లబ్ధిదారులకు 11 రకాల సర్టిఫికెట్లు సచివాలయంలో ఎటువంటి రుసుము లేకుండా కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇన్ని రకాల పథకాలు, సేవలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని చెప్పారు. ఆ ఘనత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి ఘనత దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో చింతకొమ్మదిన్నె జడ్‌పిటిసి నరేన్‌ రామాంజనేయులు, ఎంపిపి చీర్ల సురేష్‌ యాదవ్‌, మండల కన్వీనర్జీని భాస్కర్‌ రెడ్డి, పవన్‌ కన్వీనర్‌ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, మండల వ్యవసాయ సలహాదారుడు ఎర్ర సాని మోహన్‌ రెడ్డి, చెన్నూరు సర్పంచ్‌ వెంకట సుబ్బయ్య, కొండపేట సర్పంచ్‌ తుంగ చంద్ర యాదవ్‌, పంచాయతీ కార్యదర్శి రామ సుబ్బారెడ్డి, రెండవ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. వల్లూరు : ప్రజలందరూ జగనన్నసురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమలాపురం నియోజవర్గం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని కోట్లూరు పంచాయతీలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు సేవలందించడమే జగనన్న సురక్ష లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలని తెలిపారు. జగనన్న సురక్షలో భాగంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు కుల, ఆదాయ ,జనన ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తు చేసుకొని ఉచితంగా పొందవచ్చు అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ శంకర్రావు, ఎంపీడీవో జుబేదా, మాజీ జడ్‌పిటిసి అబ్బిరెడ్డి వీరారెడ్డి, మండల అధికారులు సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.