బుక్‌లెట్‌ను అందజేస్తున్న ప్రదీప్‌రెడ్డి
ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రభుత్వం నుంచి మంజూరైన సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందిన వారి నుంచి వైసిపి రాష్ట్ర యువజన విభాగం నాయకులు వై.ప్రదీప్ రెడ్డి ఆరా తీశారు. సోమవారం మండలంలోని మాలపల్లి సచివాలయం పరిధిలోని సౌళ్లహళి గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికీ తిరిగి నాలుగేళ్ల పాలనలో మంజూరైన సంక్షేమ పథకాలకు సంబంధించిన బుక్ లెట్ అందజేసి ముందుకు సాగారు. ఉరుకుందు ఈరన్న స్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులు లక్ష్మి రెడ్డి, సర్పంచి రాధమ్మ, ఎంపిటిసి ఈరన్న నాయకులు సాయి నాథ్ రెడ్డి పాల్గొన్నారు.










