Nov 10,2023 21:02

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి

ములకలచెరువు : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు ప్రభుత్వం పెద్దపీఠ వేస్తోందని మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌, మంత్రులు ఉషశ్రీచరణ్‌, నాగార్జున అన్నారు. శుక్రవారం ములకలచెరువులో సామాజీక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనిల్‌మారయాదవ్‌ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనార్టీలకు 50శాతం పైగా రాజకీయ పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. 2024లో మరోసారి జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. రాష్ట్రంలో 156 సామాజీక కులాలు ఉన్నాయని, వారందరికి న్యాయం చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని అన్నారు. అనంతరం మంత్రి నాగార్జున, ఉషశ్రీచరణ్‌ లు మాట్లాడుతూ గత నాలుగన్నరేళ్ల వైసిపి పాలనలో అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తున్నారన్నారు. 35 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత సిఎం జగన్‌కు దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీకలు రూ.1018 కోట్లు జగన్‌ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నాడు లేని విధంగా నియోజకవర్గాన్ని అభివద్ధి పథకంలో నడిపించన ఘనత పెద్దిరెడ్డి కుటుంబాకే దక్కిందన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజాన్‌, జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రఘురాం, జిల్లా ఉపాధ్యక్షుడు పాగొండఖలీల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రజనీసురేంద్ర, మండల కన్వీనర్‌ మాధవరెడ్డి, మాజీ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవింద్రారెడ్డి పాల్గొన్నారు.