సంక్షేమ పథకాల అమలులో అగ్రస్థానం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఎంపిపి కేత వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని, చర్లోయడవల్లి సచివాలయంలో నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్, ఆయా పంచాయతీల ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు, పంపిణీలో రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని, ఈ ఘనత మొత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని తెలియజేశారు. ఈ సామాజిక పింఛన్లు అనేవి అవ్వతాతల, వికలాంగుల సామాజిక జీవనానికి తోడ్పాటుకు ఎంతో దోహదపడునని తెలియజేశారు. కార్యక్రమంలో రావులకొల్లు వైసిపి నాయకులు రామిరెడ్డి మోహన్ రెడ్డి, పద్మనాభ రెడ్డి, సచివాలయం సిబ్బంది, వలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.










