నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివద్ధి పథకాల వేగాన్ని మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి మండల ప్రత్యేక మరియు జిల్లా అధి కారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం సాయంత్రం సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, జిల్లా అధికారులతో అంతర్గత సమీక్ష సమావేశం నిర్వ హించారు. సమావేశంలో ప్రధానంగా మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో ప్రభుత్వ పథకాల నిర్వహణపై చర్చించారు. జూన్ 23 నుంచి జులై 23 వరకు జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభోత్సవం జరగబోతున్న దృష్ట్యా అధికారులంతా భాగస్వాములై పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ధ్రువీకరణ పత్రాలు, డాక్యుమెంట్స్ లేక నవరత్నాల పథకాలు ఆగిపోతే, వారి ఇళ్లకు వెళ్లి వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి, ప్రత్యేక క్యాంపు ల ద్వారా అర్హులుకు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక డ్రైవ్ లో భాగస్వాములు కావాలని సూచించారు.అర్హత కలి గిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసు కోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జూన్ 24 నుంచి జగనన్న సురక్ష పథకం పై అవగాహన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నిర్వహించాలన్నారు.
జులై 1 నుంచి క్యాంపుల నిర్వహణ జరుగుతుందని, క్యాంపు నిర్వహణకు వారం రోజులు ముందు సర్వీసులన్నిటిని జగనన్న సురక్ష యాప్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21న నిర్వహించనున్న సందర్భంగా ఎంపీడీవో లు అందరూ ఆజాదికా అమత్ మహౌత్సవ్ సందర్భంగా అమత్ సరోవర్ ట్యాంకుల వద్ద తప్పనిసరిగా ఫోటోలు తీయాలని, తహశీల్దార్, ఏ ఈ ఆర్ ఓ లు, వీఆర్వోలు ఫారం 6 ఏ,7,8 పూర్తి చేయాలని ట్రాన్స్ జెండర్ ల డేటాను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, డ్వామా పిడి జోసఫ్ కుమార్, డి ఆర్ డి ఏ పి డి బాలు నాయక్, ఉద్యాన శాఖ అధికారి బి.జె బెన్ని, గహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాలరావు, డిస్టిక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ మహాలక్ష్మి, జిల్లా టిబి , లెప్ర సీ అధికకారిణి డాక్టర్ పద్మజ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వెంకటేశ్వరరావు, సూక్ష్మ నీటిపారుదల శాఖ అధికారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
డికె పట్టా అందజేత
చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామానికి చెందిన షేక్.చాన్ బీ భర్త ఖాదర్సా పేరున సర్వే నంబరు 40- 1హెచ్2 లో 50 సెంట్ల భూమిని వ్యవసాయ సాగు నిమిత్తం డి.కె పట్టాను కలెక్టర్ శివశంకర్ మంజూరు చేశారు. నరసరావుపేట కలెక్టరేట్ లో సోమవారం 50 సెంట్ల డికె పట్టాను లబ్ధిదారునికి ఆయన అందజేశారు.
ఉత్తమ ఆరోగ్య మిత్రలకు సత్కారం
డాక్టర్ వైయస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రాలను ప్రోత్సహించటం కోసం రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను అందిస్తుంది, అందులో భాగంగా ఏప్రిల్ మరియు మే నెలకు గాను సేవ మిత్రా అవార్డులకు పల్నాడు జిల్లా లో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రాలు సత్తెనపల్లి బాజీ మరియు షేక్ హసన్ లు ఎంపికయ్యారు. ఈ అవార్డులను పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివ శంకర్ ,జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా అవార్డు తో పాటు రూ 5 వేలు నగదు ను వారు అందు కున్నారు. జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ పి. సునీల పాల్గొన్నారు.










