ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వమైన వైసిపిని ఆదరించాలని వైసిపి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి కోరారు. శనివారం పట్టణంలోని 30వ వార్డు సచివాలయంలో రెండోరోజూ 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ముందుగా ఆంజనేయ స్వామి గుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, వాటి ద్వారా పొందిన లబ్ధిని వివరించారు. వార్డు పరిధిలోని కొన్ని వీధుల్లో తాగునీటి సరఫరా సమస్య, సిసి రోడ్లు తదితర సౌకర్యాలు కావాలని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అన్ని వార్డుల్లో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి










