
ప్రజాశక్తి-నెల్లిమర్ల : ప్రజా సంక్షేమ పాలన వైసిపితోనే సాధ్యమని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. నగర పంచాయతీ పరిధిలోని నాలుగో వార్డులో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. అనంతరం రెల్లివీధిలో రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని ఎమ్మెల్యే బడ్డుకొండ ప్రారంభించారు. 7వ సచివాలయంలో వివిధ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన బోర్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే... సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురేష్‌బాబు, నగర పంచాయతీ చైర్‌పర్సన్ బంగారు సరోజినీ, వైస్ చైర్మన్లు సముద్రపు రామారావు, కారుకొండ వెంకట కృష్ణారావు, వైసిపి పట్టణ అధ్యక్షులు చిక్కాల సాంబశివరావు, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు మద్దిల వాసు, జానా ప్రసాద్, నౌపాడ శ్రీనివాసరావు, ఎఎంసి డైరెక్టర్ పొలుబోతు నారాయణమూర్తి, కమిషనరు పి.బాలాజీ ప్రసాద్ పాల్గొన్నారు.

భోగాపురం : వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేది తానేనని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ధీమా వ్యక్తంచేశారు. భోగాపురంలోని సచివాలయం-2 పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్ని పార్టీలు కలిసినా, తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని అన్నారు. వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, నాయకులు పడాల శ్రీనివాసరావు, పడాల భాను, సుందర హరీష్ మాట్లాడుతూ మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యేను ముచ్చటగా మూడోసారి కూడా గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ అప్పలనాయుడు, ఎంపిటిసి కొయ్య సంతోషి, మాజీ ఉప సర్పంచ్ కొమ్మూరి శుభోషణరావు, ఉదయబాబు, సర్పంచులు బైరెడ్డి రాజు, పైడినాయుడు, నూకరాజు, ఇఒ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బాడంగి : బాడంగిలో వై ఎపి నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. జెసిఎస్ మండల కన్వీనర్ మరిపి శంకరరావు, జెడ్‌పిటిసి పెద్దింటి రామారావు ఆధ్వర్యాన కార్యక్రమాన్ని చేపట్టారు.
రామభద్రపురం : రామభద్రపురం సచివాలయం-1 పరిధిలో ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు ఆధ్వర్యాన అన్నారు. ఎందుకు రాష్ట్రానికి జగనే కావాలి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు అప్పికొండ లక్ష్మునాయుడు, జెసిఎస్ కన్వీనర్ చింతల సింహాచలం నాయుడు, సచివాలయ కన్వీనర్ కర్రి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వేపాడ : మండలంలో బొద్దాం సచివాలయంలో వై ఎపి నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని ఎంపిపి సత్యవంతుడు ఆధ్వర్యాన నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి అప్పారావు, పంచాయతీరాజ్ జోనల్ ఇన్‌ఛార్జి సత్యనారాయణ, ఎఎంసి చైర్‌పర్సన్ కస్తూరి, వైసిపి మండల అధ్యక్షులు జగన్నాథం, సర్పంచ్ రామ సత్యవతి పాల్గొన్నారు.
వేపాడలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు హాజరయ్యారు. రోడ్డుపై ఉన్న టి కొట్టు వద్ద అల్పాహారం తీసుకున్నారు. బక్కునాయుడుపేట వెళ్లి ప్రభుత్వ పథకాలపై వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎం.అర్జునమ్మ, ఎంపిటిసి గాడి గంగతల్లి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎన్.వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.