
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్: హమాలీలు( ముఠా ) కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేసి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. శనివారం సిఐటియు జిల్లా అధ్యక్షులు అడిగర్ల రాజు మీడియాతో మాట్లాడుతూ,నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిదిలో సుమారు 1000 మంది వివిద రకాల హమాలీ (ముఠా) పనులు చేస్తూ జీవిస్తున్నారని తెలిపారు. హమాలీ (ముఠా )పనులతోనే వ్యాపారం వృద్ధి చెందుతున్నాయని, దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయిల పన్నులు వస్తున్నాయన్నారు. హమాలీ( ముఠా ) కార్మికులకు ప్రమాద భీమా, ఇఎస్‌ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. హమాలీలు ప్రమాదాలకు గురైన సందర్భంలో కుంటుంబ పోషణకు తీవ్ర ఆర్దిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అర్హులకు ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు, పెన్షన్‌లు కల్పించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం హమాలీ (ముఠా )కార్మక సంఘం (సిఐటియు) ప్రెసిడెంట్ రుత్తల గోవింద్, కొశాదికారి ఎం. రమణ, రాము, రాజు, సాంబ, సత్తిబాబు, నాగేశ్వరరావు, అప్పారావు, తాతబాబు పాల్గొన్నారు.