ప్రజాశక్తి - చింతలపూడి
సంక్రాంతిలోపు జగనన్న ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని జిల్లా జెడ్‌పి సిఇఒ రవికుమార్ అన్నారు. పట్టణంలో నాగిరెడ్డిగూడెం లే అవుట్ వద్ద జగనన్న ఇళ్ల నిర్మాణ పనులు మంగళవారం పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడుతూ వెలుగు కార్యాలయం నుంచి రూ.35 వేలు లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని ఎపిఎంని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతికి గృహ నిర్మాణాలు పూర్తయితే అందరూ గృహ ప్రవేశాలు చేసుకుంటారన్నారు. పనులు వారం వారం పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జ్యోతి, ఎంపిడిఒ మణికుమారి పాల్గొన్నారు.










