ప్రజాశక్తి-విఆర్.పురం
సంక్రాంతి పండుగను పరస్కరించుకొని మండలంలోని పెద్దమటపల్లి గ్రామంలో వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ పోటీలను విఆర్.పురం ఎస్సై దుర్గాప్రసాద్, పెద్దమట్టపల్లి సర్పంచ్ వెట్టి లక్ష్మి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మి మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, మన్యం క్రీడా స్ఫూర్తిని సాటి చెప్పాలని కోరారు. ఎస్సై దుర్గాప్రసాద్ మాట్లాడుతూ యువత మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి ఇటువంటి క్రీడా పోటీలు ఎంతగానో దోహద పడతాయని తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ క్రీడా పోటీలలో యువత అధిక సంఖ్యలో పాల్గొవాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు, అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. కోడి పందేలు, పేకాట జోలికి పోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కారం సత్తిబాబు, మోసం చంద్రరావు, పండా వెంకటేష్, గ్రామ పెద్దలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కారం సత్తిబాబు మోసం చందర్ రావు పండా వెంకటేష్ గ్రామ పెద్దలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు










