Oct 22,2023 00:27

ప్రజాశక్తి-యంత్రాంగం రాష్ట్రంలో ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఒక సంజీవనిగా ఉపకరిస్తోందని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. శనివారం పలుచోట్ల జగనన్న వైద్య శిబిరాలు నిర్వహించారు. సామర్లకోట రూరల్‌ పి.వేమవరంలో జెడ్‌పిటిసి ఎలిశెట్టి అమృత నరేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలకు కేవలం సంక్షేమ పథకాలు అందించడంతోపాటు వారి సంపూర్ణ ఆరోగ్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. అనంతరం ఆరోగ్య సురక్ష కిట్లను ప్రజలకు ఆయన అందజేశారు. ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, వైద్యాధికారి డాక్టర్‌ పి.ప్రశాంత్‌, నాయకులు ఎలిశెట్టి నరేష్‌, ఎలిశెట్టి భీమన్న దొర, సర్పంచ్‌ ఎలిశెట్టి నూకరత్నం పాల్గొన్నారు. గండేపల్లి మల్లేపల్లిలో ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు వైద్యులు, అంగన్‌వాడీలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చలగళ్ల దొరబాబు, వైఎస్‌ ఎంపిపి బిట్రా వెంకటలక్ష్మి రమణ, సర్పంచ్‌ బలిరెడ్డి వరలక్ష్మి గంగరాజు, ఉప సర్పంచ్‌ దొమ్మా శ్రీను, సొసైటీ అధ్యక్షులు బిట్రా గిరిబాబు, ఎంపిటిసి బత్తుల వరలక్ష్మీ వీరబాబు, ఎంపిడిఒ వెంకట రామన్‌, ఇఒపిఆర్‌డి మూర్తి, కార్యదర్శి కట్టా చంద్రశేఖర్‌, మెడికల్‌ ఆఫీసర్‌లు సౌమ్య, నరేష్‌, అనిత, జయలక్ష్మి, శైలజ, ప్రసన్న పాల్గొన్నారు. పెద్దాపురం మండలం వడ్లమూరు పాఠశాల ఆవరణలో నిర్వహించిన శిబిరంలో డాక్టర్‌ విజయ శేఖర్‌, డాక్టర్‌ ఉషారాణి, డాక్టర్‌ అనూష, డాక్టర్‌ శ్రీ సాత్యలక్ష్మి, డాక్టర్‌ మాధురి 385 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కంటే శివశంకర్‌, చల్లా రామాంజనేయులు, వాయిలేటి చిన్నారావు, ఉండమట్ల గంగాధర్‌, కంటే రాజేంద్ర, పంచాయతీ కార్యదర్శి కళ, విఆర్‌ఒ లక్ష్మణ్‌, వంశీ, మూర్తి, లోవ మణి పాల్గొన్నారు. యు.కొత్తపల్లి శ్రీరాంపురం సచివాలయంలో నిర్వహించిన శిబిరాన్ని సర్పంచ్‌ రావి రమేష్‌ ప్రారంభించారు. పిర్ల గంగాధర్‌, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తదిత నాయకులు పాల్గొన్నారు. కరప ఉప్పలంకలో నిర్వహించిన శిబిరాన్ని రూరల్‌ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు ప్రారంభించారు. జెడ్‌పిటిసి యాళ్ల సుబ్బారావు, ఎంపిపి పెంకే శ్రీలక్ష్మి సత్తిబాబు, ఎంపిడిఒ కె.అప్పారావు, తహశీల్దారు పొన్నమండ శ్రీనివాసరావు, డాక్టర్‌ శ్రీనివాస్‌ నాయక్‌, సర్పంచ్‌ బొమ్మిడి నయోమి సతీష్‌ పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి కె.నాగేంద్ర కుమార్‌ పాల్గొన్నారు.