Feb 02,2023 00:17

గిరిజనులకు రగ్గులు పంపిణీ చేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి -సీలేరు
మారుమూల గ్రామాల్లో యువత అభివృద్ధి చెందాలంటే సంఘ విద్రోహశక్తులకు దూరంగా ఉండాలని సిఆర్పిఎఫ్‌ 42 బెటాలియన్‌ కమాండెంట్‌ సతీష్‌ కుమార్‌ గిరిజనులకు పిలుపునిచ్చారు. మావోయిస్టు కంచుకోటగా ఉన్న జీకే వీధి మండలం, దుప్పిలివాడ పంచాయతీ గొర్రె లోవలో బుధవారం సీలేరు సిఆర్పిఎఫ్‌ 42 బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ సురేష్‌ స్థానిక ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిక్‌ యాక్షన్‌ ప్రోగ్రాంలో సతీష్‌కుమార్‌, జికె.వీధి సిఐ అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా బంధ వీధి, కొమ్ములవాడ, గుండేరు బయలు, పులి గుప్ప గ్రామ గిరిజనులకు 190 రగ్గులు, 24 వాటర్‌ డ్రమ్ములు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెగా వైద్య శిబిరాన్ని పోలీసులు వైద్య అధికారి సౌమ్య నిర్వహించారు. 300 మంది గిరిజనులు పాల్గొనగా 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ గిరిజన యువత బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు అవరోధించాలని సూచించారు. సిఐ అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గొర్రెలోవ, బంధ వీధి, కొమ్ములవాడ, పులి గుప్ప, గుండేరు బైలు గ్రామాలకు చెందిన 300 మంది గిరిజనులకు పోలీసులు భోజనాలు ఏర్పాటు చేశారు.